ప్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసిన కెల్టన్ టెక్ | Sakshi
Sakshi News home page

ప్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసిన కెల్టన్ టెక్

Published Tue, Jun 2 2015 2:24 AM

ప్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసిన కెల్టన్ టెక్

ఒప్పందం విలువ రూ. 88 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను అందించే హైదరాబాద్‌కు చెందిన కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ అమెరికాకు చెందిన ప్రోసాఫ్ట్ గ్రూపును కొనుగోలు చేసింది. ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ అందించే ప్రో సాఫ్ట్‌ను రూ. 88 కోట్లకు (14 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసినట్లు కెల్టన్ టెక్ ఫౌండర్ చైర్మన్ నిరంజన్ చింతమ్ తెలిపారు. ఇందుకు కావాల్సిన నిధులను 60:40 డెట్-ఈక్విటీ నిష్పత్తిలో సమకూర్చినట్లు తెలిపారు.

ప్రోసాఫ్ట్ కొనుగోలు వల్ల కంపెనీ ఆదా యం అదనంగా రూ. 240 కోట్లు, లాభం రూ.19 కోట్లు పెరగనున్నట్లు తెలిపారు. ఈ విలీనం వల్ల 100 మిలియన్ డాలర్ల కంపెనీగా కెల్టన్ ఆగస్టు 2016లోగా ఎదగనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 80 మిలియన్ డాలర్లుగా ఉంది.

ప్రోసాఫ్ట్‌కి చెందిన 375 మంది ఉద్యోగులు చేరడంతో కెల్టన్ టెక్ ఉద్యోగుల సంఖ్య 1,000 దాటినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వ్యాపార విస్తరణకు అనువైన కంపెనీలను టేకోవర్ చేయడానికి పరిశీలిస్తున్నామని, నవంబర్‌లోగా క్విప్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించే యోచనలో ఉన్నామని నిరంజన్ వివరించారు. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం కెల్టన్ టెక్ షేరు 4 శాతం లాభపడి రూ. 82 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement