జనవరిలో కీలక పరిశ్రమల వృద్ధి 2.9 శాతం | Sakshi
Sakshi News home page

జనవరిలో కీలక పరిశ్రమల వృద్ధి 2.9 శాతం

Published Tue, Mar 1 2016 2:20 AM

జనవరిలో కీలక పరిశ్రమల వృద్ధి 2.9 శాతం

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జనవరిలో 2.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గడచిన మూడు నెలల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ రంగాల వాటా 38 శాతం. మార్చి రెండవ వారం చివర్లో జనవరి ఐఐపీ ఫలితాలు వెలువడనున్నాయి.  కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ కీలక గ్రూప్ వృద్ధి రేటు 2 శాతంగా ఉంది.

Advertisement
Advertisement