పదేళ్లలో బిలియనీర్లు డబుల్ | Sakshi
Sakshi News home page

పదేళ్లలో బిలియనీర్లు డబుల్

Published Fri, Mar 7 2014 12:58 AM

పదేళ్లలో బిలియనీర్లు డబుల్

 న్యూయార్క్: భారత్‌లో రానున్న పదేళ్లలో కుప్పలు తెప్పలుగా సంపద పోగుపడుతుందని, కుబేరుల సంఖ్య పెరుగుతుందని అంతర్జాతీయ ప్రోపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ 2014 వెల్త్ రిపోర్ట్ పేర్కొంది. 2023 కల్లా బిలియనీర్ల సంఖ్య విషయమై నాలుగో అతి పెద్ద దేశంగా భారత్ అవతరిస్తుందంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...,

     గత ఏడాది 60గా ఉన్న భారత్ బిలియనీర్ల సం ఖ్య 2023కల్లా 98% వృద్ధితో 119కు చేరుతుంది.
     2023 కల్లా అమెరికా, చైనా, రష్యాల తర్వాత అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుంది.
     ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కన్నా భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య అధికంగా ఉంటుంది.
     {పపంచంలో మూడో పెద్ద వేగవంత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో సంపద సృష్టి మరింత వేగంగా వృద్ధి చెందుతుంది.
     పదేళ్లలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్‌ఎన్‌ఐ) సంఖ్య రెట్టింపవుతుంది. 2013లో 1,576గా ఉన్న వీరి సంఖ్య 3,130కు పెరుగుతుంది.

     గత ఏడాది 383గా ఉన్న 10 కోట్ల డాలర్లకు పైగా ఆస్తులున్న కుబేరుల సంఖ్య 2023 నాటికి 99 శాతం వృద్ధితో 761కు పెరుగుతుంది.
     పదేళ్లలో యూరప్ కన్నా ఆసియాలోనే కుబేరుల సంఖ్య అధికంగా ఉంటుంది.
     కుబేరుల సంఖ్య వృద్ధి విషయంలో అత్యధిక వృద్ధి ఉండే నాలుగో నగరంగా ముంబై నిలిచింది. ఈ సంఖ్య 577 నుంచి 126% వృద్ధితో 1,302కు పెరుగుతుంది. ముంబై తర్వాత 118%  వృద్ధితో ఢిల్లీ నిలిచింది.
     2024 నాటికల్లా టాప్ 10 గ్లోబల్ సిటీల్లో   ముంబై చోటు సాధిస్తుంది.

Advertisement
Advertisement