మార్కెట్లోకి ‘కొడాక్‌ సీఏ సిరీస్‌’ టీవీలు

17 Mar, 2020 06:00 IST|Sakshi

43 అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ. 23,999

న్యూఢిల్లీ: గూగుల్‌ సర్టిఫికేట్‌ పొందిన అండ్రాయిడ్‌ టెలివిజన్లలో అత్యంత చౌక ధరలకే కొడాక్‌ తన కొత్త తరం టీవీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ బ్రాండ్‌ విక్రయానికి లైసెన్సు కలిగి ఉన్న సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌పీపీఎల్‌).. ‘కొడాక్‌ సీఏ సిరీస్‌’ పేరిట వీటిని సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. డాల్బీ విజన్, 4కే హెచ్‌డీఆర్‌10, ఆండ్రాయిడ్‌ 9.0 ఇంటర్‌ఫేస్, డీటీఎస్‌ ట్రూసరౌండ్‌ కలిగిన డాల్బీ డిజిటల్‌ ప్లస్, యుఎస్‌బీ 3.0, బ్లూటూత్‌ వీ5.0 (తాజా వెర్షన్‌), అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఆప్షన్లు కలిగిన యూజర్‌ ఫ్రెండ్లీ రిమోట్‌ వంటి అధునాతన ఫీచర్లు కొత్త సిరీస్‌లో ఉన్నాయి. 43, 50, 55, 65 అంగుళాల సైజుల్లో టీవీలు లభిస్తుండగా.. ప్రారంభ ధర రూ. 23,999, హై ఎండ్‌ రూ. 49,999కే లభిస్తున్నట్లు ఎస్‌పీపీఎల్‌ డైరెక్టర్, సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వ్‌ ప్రకటించారు. మార్చి 19 నుంచి ఈ సీరిస్‌ టీవీలు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉండనున్నాయి.  

మరిన్ని వార్తలు