34 ఏళ్లు.. 15 స్టోర్లు 10,700 కోట్ల టర్నోవర్‌ | Sakshi
Sakshi News home page

34 ఏళ్లు.. 15 స్టోర్లు 10,700 కోట్ల టర్నోవర్‌

Published Mon, Aug 28 2017 12:54 AM

34 ఏళ్లు.. 15 స్టోర్లు 10,700 కోట్ల టర్నోవర్‌

తెలంగాణలో అడుగుపెట్టిన లలితా జ్యుయలరీ
సోమాజిగూడలో భారీ షోరూమ్‌తో రంగంలోకి
1983లో తమిళనాడులో షోరూమ్‌తో ఆరంభం
ఇపుడు తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఏపీల్లో
త్వరలో విజయవాడ, రాజమండ్రిలో షోరూమ్‌లు
తరుగు లేకుండా, తక్కువ ధరలకే: ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌
ఈ ప్రత్యేక నియమాలే తమను నిలబెట్టాయని వ్యాఖ్య  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తరించిన లలితా జ్యుయలరీ మార్ట్‌... అత్యంత భారీ షోరూమ్‌తో తెలంగాణలో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ సర్కిల్‌లో 1.3 లక్షల చదరపుటడుగుల్లో ఏర్పాటయిన లలితా జ్యుయలరీ షోరూమ్‌... ఆదివారం అట్టహాసంగా ఆరంభమయింది. 1983లో తమిళనాడులో ఒక షోరూమ్‌తో మొదలైన లలితా జ్యుయలరీ... ఇపుడు ఒక్క తమిళనాడులోనే తొమ్మిది భారీ షోరూమ్‌లతో పాటు... పాండిచ్చేరిలో ఒకటి, బెంగళూరులో రెండు, తిరుపతి, విశాఖపట్నంలలో తలా ఒకటి చొప్పున మెగా షోరూమ్‌లను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో షోరూమ్‌ల సంఖ్య 15కు చేరినట్లయింది. ‘‘బంగారం, వజ్రాలు, వెండి, ప్లాటినం ఆభరణాలను తయారీ ధరకే అందిస్తున్నాం. అంతేకాదు! తరుగును ఇంకా ఇంకా తగ్గించటంపై మేం నిరంతరం శ్రమిస్తున్నాం. అందుకే 1 నుంచి 9 శాతం తరుగుకే నగలను విక్రయించగలుగుతున్నాం.

వజ్రాభరణాల తరుగు క్యారెట్‌కు రూ.975 మాత్రమే. వెండికి తరుగే లేదు. బంగారు ఆభరణాలకు బీఐఎస్‌916 హాల్‌మార్క్‌ సర్టిఫికెట్‌ను, వజ్రాభరణాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తున్నాం’’ అని షోరూమ్‌ ఆరంభం సందర్భంగా లలితా జ్యుయలరీ మార్ట్‌ ఎండీ, చైర్మన్‌ ఎం.కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. తమ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.10,700 కోట్ల వరకూ ఉందని, త్వరలో విజయవాడ, రాజమండ్రిలో కూడా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ‘‘తక్కువ తరుగు, బయటికి చెప్పని చార్జీలు వడ్డించకపోవటం, సరసమైన ధర వంటివి మా నియమాలు. వీటిని పాటిస్తుండటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాం’’ అని ఆయన వివరించారు.

ధరలు పోల్చి నగలు కొనొచ్చు!
ఏ షాపులోనైనా బంగారం కొనేటపుడు సదరు నగను ఫొటో తీసుకుని మరో షాపులో చూపిస్తామంటే ససేమిరా అంగీకరించరు. లలితా జ్యులయరీ మాత్రం దీన్నే ఓ చాలెంజ్‌ స్థాయికి తీసుకెళ్లింది. తాము నగలు కొనేముందు ఎస్టిమేట్‌ స్లిప్‌ ఇస్తామని, నగ ఫొటోను కూడా తీసుకోవచ్చని తెలిపింది. ‘‘ఆ ఫొటోను, నగను ఇతర షోరూమ్‌లలో ఎక్కడైనా చూపించొచ్చు. ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడే కొనొచ్చు. ఇంత ధైర్యంగా ఈ చాలెంజ్‌ను ఎందుకు స్వీకరించామంటే ఎవ్వరూ మాకన్నా తక్కువ ధరకు విక్రయించలేరన్న మా నమ్మకమే కారణం’’ అని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో కిరణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

 ‘‘కొందరు ఉచిత ఆఫర్లు చూసి మోసపోవటం, స్కీమ్‌ అనగానే చేరిపోవటం, బిల్లు – ట్యాక్స్‌ లేదంటే వెంటనే ఒప్పేసుకోవటం చేస్తుంటారు. అలా చేయొద్దనేది నా అభ్యర్థన. తరుగుకు ఎంత చెల్లిస్తున్నామో చూసుకోవటంతో పాటు బిల్లులో అన్ని అంశాలూ ఉన్నాయో లేదో కూడా గమనించాలి. నగ బరువు, ఆ రోజు బంగారం ధర, తరుగు చార్జీలు, రాళ్ల ధర వంటివన్నీ బిల్లులో ఉండాలి. అప్పుడే మీ డబ్బుకు తగ్గ విలువైన బంగారాన్ని సొంతం చేసుకుంటారు’’ అని వివరించారు.

వజ్రాభరణాలకు పలు జాగ్రత్తలు
వజ్రాభరణాలు కొనేవారు దానికి షోరూమ్‌ ఇచ్చే సొంత సర్టిఫికెట్‌ కాకుండా అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని కిరణ్‌కుమార్‌ స్పష్టంచేశారు. వజ్రాల రంగు, కట్, క్యారెట్, క్లారిటీ తదితరాలన్నీ సర్టిఫికెట్లో ఉంటాయని తెలియజేశారు. హైదరాబాద్‌ షోరూమ్‌ ఆరంభం సందర్భంగా పరిమిత కాలం పాటు అన్ని వజ్రాభరణాలకూ క్యారెట్‌పై రూ.2వేల వరకూ తగ్గింపు అందజేస్తున్నట్లు తెలిపారు. బంగారం తరుగులోనూ 1 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు.

బంగారం నగలకు రెండు స్కీమ్‌లు...
 ‘స్వర్ణ ఉదయం’ పేరిట లలితా జ్యుయలరీ అందిస్తున్న స్కీమ్‌ వ్యవధి 11 నెలలు. దీన్లో తొలి నెల వాయిదా పూర్తిగా ఉచితం. మిగిలిన 10 నెలలు చెల్లించాక తగిన నగలు పొందొచ్చు. అంతేకాక ఈ స్కీమ్‌లో భాగంగా కొనుగోలు చేసే నగలకు తరుగు లేదని కూడా ప్రకటించింది. ‘అడ్వాన్స్‌ నగల బుకింగ్‌ స్కీమ్‌’లో కూడా నగలు కొనేటపుడు తరుగు లేదని సంస్థ తెలిపింది. ‘‘ఒకసారి నగదు చెల్లించి 7 నెలల తరవాత తరుగు లేకుండా మీకు నచ్చిన నగలు కొనుగోలు చేయొచ్చు. 7 శాతం తరుగు ఉన్న నగలను 7 నెలల తరవాత, 8 శాతం తరుగున్న నగనలు 8 నెలల తరవాత తరుగు లేకుండా కొనొచ్చు. అంతకన్నా ఎక్కువ తరుగుంటే ఆ వ్యత్యాసం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే పాత నగలు ఇచ్చి కూడా దీన్లో చేరొచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement