లావా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ | Sakshi
Sakshi News home page

లావా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Published Tue, May 10 2016 4:55 PM

లావా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఏ67ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,549గా ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫ్రంట్ ఫేసింగ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 2 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉండటం ఈ ఫోన్ కు ఆకర్షణీయమని చెప్పింది. గత నెలే 4జీ సపోర్టింగ్‌తో లావా రెండు కొత్త మోడళ్లు ఏ72, ఏ76లను మార్కెట్లోకి విడుదల చేసింది. వచ్చే వారాల్లో మరో స్మార్ట్ ఫోన్ ఏ89ను కూడా మార్కెట్లోకి ఆవిష్కరించబోతున్నామని పేర్కొంది. దాని ధర రూ.5,999గా ఉండబోతున్నట్టు చెప్పింది.
 

లావా ఏ67 ప్రత్యేకతలు...
5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1.2 జిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
డ్యూయల్ సిమ్
512 ఎమ్ బీ ర్యామ్
4జీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్
మైక్రో ఎస్డీ కార్డుతో 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమెరీ
ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
జీపీఆర్ఎస్/ఈడీజీఈ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్ విత్ హాట్ స్పాట్
బ్లూటూత్ వీ4.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0
154 గ్రాముల బరువు

Advertisement

తప్పక చదవండి

Advertisement