రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్ | Sakshi
Sakshi News home page

రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్

Published Sat, Dec 13 2014 12:49 AM

రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. గృహ, వాహన రుణాలపై గరిష్టంగా ఒక శాతం వరకు, బంగారు రుణాలపై 3.50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయుం తీసుకుంది. పది లక్షలలోపు గృహరుణాలపై ప్రస్తుతం 11.25%గా ఉన్న వడ్డీరేటును బేస్‌రేటుకు సవూనంగా అంటే 10.25%కి తగ్గించింది. పది లక్షల నుంచి రూ. 30 లక్షల లోపు గృహరుణాలపై వడ్డీరేటును ప్రస్తుత స్థారుు 10.50% నుంచి బేస్ రేటుకు సవరించింది.

అదే కార్‌లోన్స్ విషయూనికి వస్తే వడ్డీరేట్లు 11.75% నుంచి 10.75 శాతానికి తగ్గారుు. గృహరుణం తీసుకొని సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి కార్‌లోన్స్‌పై అదనంగా వురో పావు శాతం తగ్గింపును ఆంధ్రాబ్యాంక్ ఆఫర్ చేస్తోంది. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకునే రుణాలపై వడ్డీరేట్లను 16.5% నుంచి 13%కి తగ్గించింది. తగ్గిన వడ్డీరేట్లు డిసెంబర్ 11 నుంచి అవుల్లోకి వచ్చినట్లు ఆంధ్రాబ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement