మారుతీ కార్లలో లిథియమ్‌ బ్యాటరీలు!! | Sakshi
Sakshi News home page

మారుతీ కార్లలో లిథియమ్‌ బ్యాటరీలు!!

Published Sat, Jul 14 2018 1:32 AM

Lithium batteries in Maruti cars !! - Sakshi

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ కంపెనీ తన వాహనాల్లో లిథియమ్‌–అయాన్‌ బ్యాటరీలను అమర్చాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా తన భారత్‌ విభాగమైన మారుతీ సుజుకీ ఇండియా విక్రయించే ప్రీమియం కార్లలో వీటిని అమర్చాలని చూస్తోంది. హ్యాచ్‌బ్యాక్‌ కారు స్విఫ్ట్, దీని కన్నా ఖరీదైన మోడళ్లలో సాంప్రదాయిక లెడ్‌ బ్యాటరీల స్థానంలో దీర్ఘకాలం పనిచేసే లిథియమ్‌–అయాన్‌ బ్యాటరీలను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

లిథియమ్‌–అయాన్‌ బ్యాటరీల వల్ల వ్యయం తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తొషిబా, డెన్సో కంపెనీల భాగస్వామ్యంతో సుజుకీ రూ.1,152 కోట్లతో గుజరాత్‌లో బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తయారయ్యే బ్యాటరీలను కేవలం కార్లలోనే కాకుండా సుజుకీ మోటార్‌ మార్కెట్‌లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్‌ టూవీలర్లలోనూ ఉపయోగిస్తారు. కంపెనీ 2020 కల్లా ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement
Advertisement