డెట్రాయిట్‌లో మహీంద్రా ప్లాంటు | Sakshi
Sakshi News home page

డెట్రాయిట్‌లో మహీంద్రా ప్లాంటు

Published Tue, Nov 21 2017 11:45 PM

Mahindra plant in Detroit - Sakshi - Sakshi

వాషింగ్టన్‌: దేశీ వాహన దిగ్గజం ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎంఅండ్‌ ఎం) తాజాగా డెట్రాయిట్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. దీని కోసం 230 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. ఈ కొత్త ప్లాంటు 250 మందికి ఉపాధి కల్పిస్తుందని సంస్థ తెలిపింది. డెట్రాయిట్‌ను ప్రపంచ ఆటోమోటివ్‌   పరిశ్రమకు కేంద్ర స్థానంగా పరిగణిస్తారు. కాగా, 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ఒక వాహన  ప్లాంట్‌  ఏర్పాటవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

‘మహీంద్రాకు ఇది అపూర్వమైన క్షణం’ అని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాతెలిపారు. ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా మిచిగన్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ బ్రియాన్‌ కల్లే మాట్లాడుతూ.. మహీంద్రా ఉద్యోగులను ఉద్దేశించి ‘డెట్రాయిట్‌ పునరుద్ధరణలో మీరు చాలా ముఖ్యమైనవారు. కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కొద్ది వారాల్లో ఈ ప్లాంటు నుంచి ఆఫ్‌–రోడ్‌ వెహికల్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తామని సంస్థ తెలిపింది.

‘తాజా విస్తరణ మాకు, మిచిగన్‌కు ఒక మైలురాయి లాంటిది. నాలుగేళ్ల క్రితం ఏడుగురితో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఇప్పుడు 250 మందికి చేరాం. ఉద్యోగుల కృషికి నిదర్శనం’ అని మహీంద్రా ఆటోమోటివ్‌ నార్త్‌ అమెరికా ప్రెసిడెంట్, సీఈవో రిచార్డ్‌ హాస్‌ తెలిపారు. 2020 నాటికి 400 మందికిపైగా ఉపాధి, 600 మిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement