ఆన్లైన్లో ఇండస్ట్రియల్ స్పేర్ పార్ట్స్ | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో ఇండస్ట్రియల్ స్పేర్ పార్ట్స్

Published Thu, Sep 29 2016 1:04 AM

ఆన్లైన్లో ఇండస్ట్రియల్ స్పేర్ పార్ట్స్

హైదరాబాద్‌లో స్పేర్‌ పార్ట్స్
జూన్‌లోగా గిడ్డంగుల ఏర్పాటు
కంపెనీ కో-ఫౌండర్ దినేష్ అగర్వాల్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న స్పేర్‌ఎన్‌పార్ట్స్.కామ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 350 మంది విక్రేతలతో చేతులు కలిపిన ఈ కంపెనీ.. ఇప్పుడు భాగ్యనగరిలో ఉన్న రిటైలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 200 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో హైదరాబాద్ మొదటి 20 స్థానాల్లో ఉంటుందని గ్లోబల్ స్పేర్‌ఎన్‌పార్ట్స్ సహ వ్యవస్థాపకులు దినేష్ కుమార్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ఇక్కడ సిబ్బందిని నియమించడం ద్వారా దక్షిణాది మార్కెట్లో విస్తరిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కస్టమర్లకు 3-7 రోజుల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. 100కుపైగా ప్రధాన బ్రాండ్ల ప్రొడక్టులను విక్రయిస్తున్నామని వివరించారు.

 40 శాతం దాకా డిస్కౌంట్..
కంపెనీ మొత్తం 24 విభాగాల్లో 1 లక్షకుపైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. సేఫ్టీ ప్రొడక్ట్స్, బేరింగ్స్, బెల్ట్స్, ఎలక్ట్రికల్స్ వంటివి వీటిలో ఉన్నాయి. ఏడాదిలో ఈ సంఖ్యను 10 లక్షలకు చేరుస్తామని దినేష్ వెల్లడించారు. 40 శాతం దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ‘తక్కువ సమయంలో ప్రొడక్టుల డెలివరీ కోసం వచ్చే జూన్ కల్లా హైదరాబాద్‌సహా 20 ప్రధాన ఇండస్ట్రియల్ ఏరియాల్లో గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం. ఇందుకు అవసరమైన నిధులను ప్రైవేటు ఈక్విటీ ద్వారా సమీకరిస్తాం. ఇండస్ట్రియల్ స్పేర్స్ మార్కెట్ 22 శాతం వార్షిక వృద్ధిరేటుతో భారత్‌లో రూ.2 లక్షల కోట్లుంది. అయిదేళ్లలో ఇది రెండింతలు కానుంది. మొత్తం మూడు కంపెనీలు ఆన్‌లైన్‌లో వీటిని విక్రయిస్తున్నాయి. ఆన్‌లైన్ వాటా కేవలం రూ.150 కోట్లు మాత్రమే’ అని వివరించారు.

Advertisement
Advertisement