సెలవు తీసుకుంటున్న జుకర్‌బర్గ్‌ | Sakshi
Sakshi News home page

సెలవు తీసుకుంటున్న జుకర్‌బర్గ్‌

Published Sat, Aug 19 2017 1:43 PM

Mark Zuckerberg to take two-month paternity leave

శాన్‌ ప్రాన్సిస్‌కో:  సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌  ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మరోసారి పెటర్నటీ సెలవును  తీసుకోనున్నారు. తన భార్య  ప్రిస్కిల్లా రెండవసారి బిడ్డను ప్రసవించబోతున్న సందర్భంగా తాను  రెండు నెలల సెలవు తీసుకుంటున్నట్టు ఫేస్‌బుక్‌ ద్వారా జుకర్‌బర్గ్‌ ప్రకటించారు.
 
2015లో మొదటి కుమార్తె మాక్స్ పుట్టినపుడు కూడా రెండునెలలు  సెలవు తీసుకున్నట్టు గుర్తు చేసుకున్నజుకర్‌బర్గ్‌  తన జీవితంలో మొదటి నెలల్లో పాపతో చాలా సమయాన్ని వెచ్చించి, ఎంజాయ్‌ చేశానని పేర్కొన్నారు. మరో  కుమార్తె త్వరలో వస్తోంది, అందుకే తాను మళ్ళీ రెండు నెలల పితృత‍్వ  సెలవును తీసుకుంటున్నట్టు   జకర్‌బర్గ్ తన  పోస్ట్‌ లో చెప్పారు. ప్రస్తుతం ఒక నెల, అనంతరం డిశెంబర్‌ లో మరో నెల ఈ లీవ్‌ను వెచ్చించనున్నట్టు చెప్పారు. తమ సంస్థలో  నాలుగునెలల పితృత్వ  సెలవును ఉద్యోగులకు ఆఫర్‌ చేస్తున్నట్టు చెప్పారు.   ఎందుకంటే పని చేసే తల్లిదండ్రులు వారి శిశువులతో కలిసి ఉండటానికి సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడతారని ఓ అధ్యయనంలో తేలిందనీ ఇది మొత్తం కుటుంబానికి మంచిదన్నారు.

కాగా ఈ నాలుగు నెలల సెలవును తండ్రులు బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో ఎపుడైనా వాడుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తమ జీవితాల్లోకి మరో పాప రాబోతోందని జుకర్‌ బర్గ్‌  ఈ ఏడాది మార్చి నెలలో ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
Advertisement