ఫ్లాట్‌గాముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Published Fri, Jun 8 2018 3:55 PM

Market closes flat at the end of a volatile session, midcaps surge  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రారంభంనుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు ఒకదశలో 100పాయింట్లకు పైగా పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 19 పాయింట్లుకోల్పోయి 35,443 వద్ద, నిఫ్టీ 0.70 పాయిం‍ట్ల నష్టతో 10,767 వద్ద  వారాంతంలో అప్రమత్తంగా ముగిశాయి. వారాంతంలో ప్రాఫిట్‌ బుకింగ్‌,అంతర్జాతీయకారణాలతో ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో బ్యాంకింగ్‌,క్యాపిటల్‌గూడ్స​, ఎఫ్‌ఎంసీజీ, ఆటోలమొబైల్‌ సెక్టార్లు  \షేర్లలో అమ్మకాల ఒత్తిడికనిపించింది. ఫార్మా, పీఎస్‌యూ , ఐటీ లాభపడగా మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ నష్టాల్లో ముగిశాయి.  లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉండగా మరోవైపు హిందాల్కో, పవర్‌గ్రిడ్‌, అశోక్‌లేలాండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, గ్రాసిమ్, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీ నష్టపోయాయి.

Advertisement
Advertisement