మార్కెట్లలో కరోనా నష్టాల వేవ్‌ | Sakshi
Sakshi News home page

మార్కెట్లలో కరోనా నష్టాల వేవ్‌

Published Mon, Jun 15 2020 3:57 PM

Market tumbles on Corona fears - Sakshi

ఉన్నట్టుండి అమెరికాలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య పెరగడం, చైనాలోని బీజింగ్‌లో రెండో దశ కరోనా వైరస్‌ తలెత్తడం వంటి ప్రతికూల వార్తలు దేశీ స్టాక్‌ మార్కె‍ట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ 552 పాయింట్లు కోల్పోయి 33,229 వద్ద నిలవగా.. నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 9,814 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. వెరసి సెన్సెక్స్‌ 33,670 వద్ద ప్రారంభమై 32,924 దిగువకు జారింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9,943 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 9,726 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 4 శాతం పతనంకాగా.. రియల్టీ, మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం పుంజుకోగా.. మీడియా 1 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, ఐటీసీ 7.2-3.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇతర కౌంటర్లలో గెయిల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా మాత్రమే అదికూడా 3.7-0.8 శాతం మధ్య లాభపడ్డాయి.

భెల్‌ వీక్‌
డెరివేటివ్స్‌లో బీహెచ్‌ఈఎల్‌, బంధన్‌ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌, ఎన్‌సీసీ, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, జిందాల్‌ స్టీల్‌ 7-4.4 శాతం మధ్య పతనంకాగా.. లుపిన్‌, టాటా పవర్‌, పీఎన్‌బీ, బీవోబీ, మైండ్‌ట్రీ 3.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. రియల్టీ కౌంటర్లలో సన్‌టెక్‌, ప్రెస్టెజ్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌ 4.3-1.6 శాతం మధ్య క్షీణించాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1311 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1945 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1332 లాభపడగా.. 1233 నష్టపోయాయి.

Advertisement
Advertisement