సెన్సెక్స్‌ 130 పాయింట్లు డౌన్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 130 పాయింట్లు డౌన్‌

Published Tue, Mar 21 2017 12:38 AM

సెన్సెక్స్‌ 130 పాయింట్లు డౌన్‌

33 పాయింట్ల నష్టంతో 9,127కు నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌130 పాయింట్లు క్షీణించి 29,519 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33  పాయింట్లు క్షీణించి 9,127 పాయింట్ల వద్ద  ముగిశాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి విజయం సాధించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల దన్నుతో సాగిన గత వారం ర్యాలీకి సోమవారం బ్రేక్‌ పడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. రూపాయి బలపడుతుండటంతో, ఎగుమతులు ఆదాయంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే అంచనాలతో ఐటీ షేర్లు నష్టపోయాయని పేర్కొన్నారు. ఐటీ షేర్లపై కాగ్నిజెంట్‌ ప్రభావం పడింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బైబ్యాక్‌
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఒక్కో షేర్‌ను రూ.1,000 ధరకు 3.5 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ బైబ్యాక్‌ విలువ రూ.3,500 కోట్లు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో  షేర్‌ ఏడాది గరిష్ట స్థాయి రూ.879ని తాకింది. చివరకు స్వల్పంగా  నష్టపోయి రూ.864 వద్ద ముగిసింది.

మహీంద్రా లైఫ్‌స్పేస్‌ రైట్స్‌ ఇష్యూ ధర రూ.292
మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ కంపెనీ– రైట్స్‌ ఇష్యూ ధరను రూ.292గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ గల 1,02,73,600 కోట్ల షేర్లను రూ.292 ధరకు జారీ చేయాలని కంపెనీ  రైట్స్‌ కమిటీ నిర్ణయించింది.

ఆయిల్‌ ఇండియా బైబ్యాక@రూ.1,527 కోట్లు
ఆయిల్‌ ఇండియా రూ. 1,527 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. 5.60 శాతం వాటాకు సమానమైన 4.49 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ.340 ధరకు  బైబ్యాక్‌ చేయాలని తమ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించిందని ఆయిల్‌ ఇండియా బీఎస్‌ఈకి నివేదించింది. ఆయిల్‌ ఇండియాలో కేంద్రానికి 66.89% వాటా ఉంది. ఈ బై బ్యాక్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆయిల్‌ ఇండియా షేర్‌ 0.5 శాతం నష్టపోయి రూ.334 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement