తగ్గనున్న చిన్న కార్ల ధరలు? | Sakshi
Sakshi News home page

తగ్గనున్న చిన్న కార్ల ధరలు?

Published Wed, Jun 15 2016 4:20 PM

తగ్గనున్న చిన్న కార్ల ధరలు? - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్‌టీ) ఆమోదానికి కేంద్రం  తీవ్ర కసరత్తు చేస్తోంది.  ఈ నేపథ్యంలో కోలకతాలో వివిధ రాష్ట్రాల  ఆర్థిక మంత్రులు, సాధికారిక కమిటీ సమావేశాలు రెండురోజుల పాటు జరిగాయి.  ఈక్రమంలో మళ్లీ జీఎస్ టీ బిల్లు  చర్చకు వచ్చింది.   పార్లమెంట్ లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడితే  చిన్న కార్లు, ద్విచక్రవాహనాలు ధరలు మరింత దిగిరానున్నాయని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఈ అంచనాల నేపథ్యంలో   ఆయా షేర్లు మార్కెట్లో లాభాల  బాటపట్టాయి.  గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ లేదా జీఎస్టీ బిల్లు   ఆమోదించబడితే ఆటో  రంగం ప్రముఖమైన లబ్దిదారుగా మారునుందని  విశ్లేషకులు అంటున్నారు.   18 శాతం ప్రతిపాదిత   రేటు ప్రకారం కార్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయని అంచనా  వేస్తున్నారు. ఇతర కమర్షియల్ వాహనాల ధరలు కూడా  కిందికి దిగిరానున్నాయని భావిస్తున్నారు.

 చిన్న కార్లు (వాహనాలు పొడవు మరియు ఇంజన్ పరిమాణం కంటే తక్కువ 1,200 సిసి / 1,500 పెట్రోల్ / డీజిల్ మోడళ్ల సిసి),  ద్విచక్రవాహనాలపై  ప్రస్తుతం 24 శాతంగా ఉన్న పన్ను రేటు 18 శాతానికి  తగ్గనుంది. అంటే వాహనాల ధరల్లో ప్రస్తుత శాతం నుంచి   7శాతం తగ్గనున్నాయి.  అయితే  40 శాతం జీఎస్ టీ రేటు ఒకే అయితే..మధ్య తరహా కార్లు,ఎస్యూవీ  (వాహనాలు పొడవు మరియు ఇంజన్ పరిమాణం కంటే తక్కువ 1,500 సిసి) లో  ప్రస్తుత మిశ్రమ పన్ను రేటు 6 శాతానికి పెరుగనుంది.  

పెద్ద కార్లు, ఎస్యూవీల (1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ పరిమాణం తో వాహనాల ధరలు) మటుకు ఈ  యథాయథంగా ఉండనున్నాయి.  అలాగే ట్రాక్లర్ల  ధరలపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశంలేదు. 12 శాతం రేటుతో ట్రాక్టర్లపై  ప్రస్తుత ఒవర్ ఆల్  టాక్స్ తో ఎక్కువగా పోలి  ఉంది. ప్యాసింజర్ వాహన విభాగంలోని డిమాండ్,  కాంపాక్ట్ సెడాన్ మరియు ఎస్యూవీ ల డిమాండ్ మధ్య తరహా ,  పెద్ద కార్లు, లేదా ఎస్ యూవీ ల వైపు మళ్లే అవకాశం ఉందని కోటక్  ప్రతినిధి హితేష్   గోయెల్ చెప్పారు.మొత్తంగా ఈ జీఎస్ టీ బిల్లు ఆమెదం  భారతదేశంలోని అతి పెద్ద కార్ల తయారీసంస్థ  మారుతి సుజుకి,  అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, యుటిలిటీ వాహనం తయారీదారు ఎం అండ్ ఎం   చాలా సానుకూలంగా ఉండన్నాయని  బ్రోకరేజ్  సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఈ అంచనాల నేపథ్యంలో మారుతి సుజుకి షేర్లు 2.61 శాతం లాభాలతో రూ. 4,211 దగ్గర ముగిసింది.  30  శాతం లాభాలతో మొదలైన ఎం అండ్ ఎం   శాతం నష్టంతో 1353రూ. దగ్గర ముగిసింది.  
ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులు, ప్రవేశపన్ను జీఎస్‌టీ వ్యవస్థలో భాగంగా ఉండటాన్ని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి.   రాష్ట్రాలకు  రాబోయే రెవెన్యూ నష్టం పట్ల ఆందోళన వ్యక్తచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో సాధికారత కమిటీ అభిప్రాయాలను ఆర్థిక మంత్రి కొత్త ముసాయిదా బిల్లు పరిగణనలోకి తీసుకోవాలని తమిళనాడు వాదిస్తోంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement