ఆల్టోను అధిగమించిన స్విఫ్ట్‌

25 Dec, 2018 00:52 IST|Sakshi

బాగా అమ్ముడైన టాప్‌–10లో ఆరు మారుతీవే..:  సియామ్‌

న్యూఢిల్లీ: అధికంగా అమ్ముడవుతున్న ప్రయాణికుల కారుగా మారుతీ ఆల్టోను తోసిరాజని అదే కంపెనీకి చెందిన స్విఫ్ట్‌ నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కారుగా మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన స్విఫ్ట్‌ రికార్డ్‌ను సాధించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ ఆల్టో కారు ఈ ఏడాది నవంబర్‌లో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం టాప్‌ టెన్‌ కార్లలో మొదటి 6 స్థానాలను మారుతీ  కార్లే సాధించగా, చివరి నాలుగు స్థానాలను హ్యుందాయ్‌ సాధించింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం... 

∙గత ఏడాది నవంబర్‌లో అమ్మకాల పరంగా ఆరో స్థానంలో ఉన్న మారుతీ స్విఫ్ట్‌ ఈ నవంబర్‌లో మొదటి స్థానానికి దూసుకువచ్చింది. 
∙మారుతీ కంపెనికి చెందిన డిజైర్‌ కారు గత నవంబర్‌లోనూ, ఈ నవంబర్‌లోనూ రెండో స్థానంలోనే నిలిచింది. అయితే అప్పటితో పోలిస్తే ఈ నవంబర్‌లో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి.  
∙ అప్పుడు – ఇప్పుడు కూడా మూడో స్థానాన్ని ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో సాధించింది.  
∙ గతంలో నాలుగో స్థానంలో నిలిచిన విటారా బ్రెజా ఈ సారి ఐదో స్థానానికి పడిపోయింది.  
∙ గత ఏడాది నవంబర్‌లో  9వ స్థానంలో ఉన్న హ్యుందాయ్‌క్రెటా ఈఏడాది నవంబర్‌లో ఎనిమిదవ స్థానానికి చేరింది.
∙ గత ఉడాది నవంబర్‌లో 7వ స్థానంలో ఉన్న హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 ఈ సారి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా