గంగానది ద్వారా మారుతీ కార్ల షిప్పింగ్ | Sakshi
Sakshi News home page

గంగానది ద్వారా మారుతీ కార్ల షిప్పింగ్

Published Tue, Aug 9 2016 1:01 AM

గంగానది ద్వారా మారుతీ కార్ల షిప్పింగ్

న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’కి చెందిన కార్లు గంగానదిపై ప్రయాణించనున్నాయి. కార్లు నదిపై వెళ్లడమేంటని అనుకుంటున్నారా? మీ ప్రశ్న కరెక్టే. కాకపోతే ఇక్కడ ట్విస్టేమిటంటే కార్లను ఓడలు మోస్తాయి. మారుతీ కార్లను ఆగస్ట్ 12 నుంచి నేషనల్ వాటర్‌వే-1 మార్గం ద్వారా వారణాసి నుంచి కోల్‌కతాకు రవాణా చేస్తామని షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారి తెలి పారు.

ఇందుకుగానూ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ మధ్య ఎంఓయూ కుదిరిందని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. వారణాసి నుంచి రెండు ఓడలను ఏర్పాటు చేస్తామని, ఒకదానిలో మారుతీ కార్లు, మరొకదానిలో తయారీ పదార్థాలు వెళతాయని వివరించారు. ‘దేశంలో జల మార్గంలో జరిగే రవాణా 3.6%గా (చైనాలో 47%) ఉంది. ఇది చాలా తక్కువ. దీన్ని 2018 నాటికి 7%కి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement