మసాలా బాండ్లకు పన్ను ప్రయోజనం | Sakshi
Sakshi News home page

మసాలా బాండ్లకు పన్ను ప్రయోజనం

Published Thu, Feb 2 2017 2:44 AM

మసాలా బాండ్లకు పన్ను ప్రయోజనం

న్యూఢిల్లీ: రూపాయి ఆధారిత మసాలా బాండ్లపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ప్రవాసీల మధ్య ఈ బాండ్ల బదలాయింపుపై పన్ను భారం ఉండబోదని పేర్కొన్నారు. కొత్తగా ఇన్వెస్ట్‌ చేసే వారికి 2020 దాకా టీడీఎస్‌ రూపంలో 5 శాతం మాత్రమే పన్ను ఉంటుందని వివరించారు. దీన్ని 2016 ఏప్రిల్‌ 1 నుంచే వర్తించే విధంగా నిబంధనలను ప్రతిపాదించారు.

విదేశీ వాణిజ్య రుణాలు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై విదేశీ సంస్థలు ఆర్జించే వడ్డీపై ప్రస్తుతం 5 శాతం మాత్రమే పన్ను ఉంటోంది. 2017 జూన్‌ 30 దాకా అమల్లో ఉండే ఈ వెసులుబాటును 2020 జూన్‌ 30 దాకా పొడిగించారు. తాజాగా ఇన్వెస్టర్ల విజ్ఞప్తుల మేరకు ఈ ప్రయోజనాన్ని మసాలా బాండ్లకూ వర్తింపచేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement