వీరికి కొలువులే..కొలువులు | Sakshi
Sakshi News home page

వీరికి కొలువులే..కొలువులు

Published Fri, Aug 18 2017 6:06 PM

వీరికి కొలువులే..కొలువులు - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఐటీ ఉద్యోగుల లేఆఫ్స్‌తో కొలువుల మార్కెట్‌ కళ కోల్పోయినా టాప్‌ కాలేజీలకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు మాత్రం భారీ డిమాండ్‌ నెలకొంది. నోట్ల రద్దు, మందగమనం నేపథ్యంలోనూ దేశంలోని ప్రతిష్టాత్మక 26 బిజినెస్‌ స్కూల్స్‌కు చెందిన గ్రాడ్యుయేట్లను ఈ ఏడాది మెరుగైన వేతన ప్యాకేజీలతో దిగ్గజ కంపెనీలు రిక్రూట్‌ చేసుకున్నాయి. పలు క్యాంపస్‌ నియామకాల్లో వేతన ప్యాకేజీలు గత ఏడాదితో పోలిస్తే పది శాతం పెరిగాయి. వ్యాపారాల డిజిటలీకరణ, విభిన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సిన క్రమంలో బిజినెస్‌ స్కూల్‌ గ్రాడ్యుయేట్లకు బహుళజాతి కంపెనీల ప్రాధాన్యత పెరిగింది.

ఈ ఏడాది 1700 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లను రిక్రూట్‌ చేసుకున్నట్టు కాగ్నిజెంట్‌ వెల్లడించింది. ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ 223 మంది బిజినెస్‌ స్కూల్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. ఇంకా క్యాప్‌జెమని, డెలాయిట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో,యాక్సెంచర్‌, కేపీఎంజీ, టీసీఎస్‌, అమెజాన్‌, ఐబీఎంలూ పెద్ద సంఖ్యలో ఎంబీఏలను రిక్రూట్‌ చేసుకున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement