ఆంధ్రాబ్యాంక్ విలీనం వార్తలు | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ విలీనం వార్తలు

Published Fri, Jan 2 2015 12:09 AM

ఆంధ్రాబ్యాంక్ విలీనం వార్తలు

నిరర్థక ఆస్తులతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రాబ్యాంక్ మరో ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం అయ్యే అవకాశం ఉందంటూ గురువారం మార్కెట్లో వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో గురువారం ఈ షేరు ధర ఒకానొక దశలో 6 శాతం వరకు పెరిగినా, చివరికి రెండు శాతం లాభంతో రూ. 96 వద్ద ముగిసింది.

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఎన్‌ఎస్‌ఈలో గురువారం ఒక్కరోజే ఆంధ్రాబ్యాంక్ కౌంటర్లో 1.70 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం. నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోవడం, మూలధనం సమకూర్చుకోవడం కష్టం కావడంతో ఆంధ్రాబ్యాంక్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల్లో ఒకదాంట్లో విలీనం కావచ్చని మీడియాలో వార్తలో వెలువడ్డాయి.

కానీ ఈ వార్తలను ఆంధ్రా బ్యాంక్ ఉన్నతాధికారులు ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రాబ్యాంక్ విలీనమయ్యే అవకాశాలు లేవంటున్నారు. రెండు రోజుల క్రితం బ్యాంకు మేనేజర్ల సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ మాట్లాడుతూ నిరర్థక ఆస్తులు తగ్గించుకోకపోతే టేకోవర్లకు టార్గెట్ బ్యాంక్‌గా తయారవుతామని, ఈ బ్యాంకును రక్షించుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందంటూ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని బ్యాంక్ విలీనమైపోతోందంటూ వార్తలు రాసాయని ఆంధ్రా బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement