‘మోడర్న్’ బ్రెడ్ వ్యాపారాన్ని విక్రయించిన హెచ్‌యూఎల్ | Sakshi
Sakshi News home page

‘మోడర్న్’ బ్రెడ్ వ్యాపారాన్ని విక్రయించిన హెచ్‌యూఎల్

Published Wed, Sep 9 2015 1:18 AM

‘మోడర్న్’ బ్రెడ్ వ్యాపారాన్ని విక్రయించిన హెచ్‌యూఎల్

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్).. ‘మోడర్న్’ బ్రాండ్‌పై నిర్వహించే బ్రెడ్, బేకరీ వ్యాపారాన్ని విక్రయించింది. ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు చెందిన నిమన్ ఫుడ్స్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ వెల్లడి కాలేదు. రాబోయే రోజుల్లో లావాదేవీ పూర్తికి అవసరమైన అనుమతులు లభిస్తాయని హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. 2000లో కొనుగోలు చేసిన మోడర్న్ బ్రాండ్ వ్యాపారాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను అప్పట్లో హెచ్‌యూఎల్ కొన్నది. కేంద్రం జరిపిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇదే.  కేక్‌లు, బన్‌లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి తయారు చేసే మోడర్న్ బ్రాండ్‌కి ఆరు ప్లాంట్లు ఉన్నాయి.

Advertisement
Advertisement