మార్కెట్‌లోకి ‘మోటో ఎక్స్‌4’ | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘మోటో ఎక్స్‌4’

Published Tue, Nov 14 2017 12:59 AM

Motorola Moto X4 launched in India - Sakshi

న్యూఢిల్లీ: లెనొవొ గ్రూప్‌నకు చెందిన ‘మోటరోలా’ తాజాగా ‘మోటో ఎక్స్‌4’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది ప్రధానంగా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.20,999గా, 4 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.22,999గా ఉంది.

మోటో ఎక్స్‌4లో డ్యూయెల్‌ ఆటోఫోకస్‌ పిక్సెల్‌ టెక్నాలజీతో కూడిన 12 ఎంపీ+8 ఎంపీ రియర్‌ కెమెరా, లో–లైట్‌ మోడ్‌ ఫీచర్‌ ఉన్న 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, డ్యూయెల్‌ సిమ్‌ (నానో), ఆండ్రాయిడ్‌ 7.1.1 నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్, ఐపీ 68 వాటర్‌/డస్ట్‌ రెసిస్టెన్స్, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, టర్బో పవర్‌ చార్జర్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. కాగా ఈ ఫోన్లు కేవలం ఫ్లిప్‌కార్ట్, మోటో హబ్‌ షాప్స్‌లో బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. 

Advertisement
Advertisement