కొనసాగిన అమ్మకాలు | Sakshi
Sakshi News home page

కొనసాగిన అమ్మకాలు

Published Wed, Jun 10 2015 1:02 AM

MSCI Rejig Could Trigger Selloff in Indian Markets

నిఫ్టీకి 7 రోజుల వరుస నష్టాలు
42 పాయింట్ల నష్టంతో 26,481 పాయింట్లకు సెన్సెక్స్

 
ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో భారత వెయిటేజీ తగ్గుతుందనే ఆందోళనలతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలపాలయ్యింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటంతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి 26,481 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 8,022 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ వరుసగా ఏడు రోజుల నుంచీ నష్టాల్లోనే ఉంది. రియల్టీ, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, వాహన, క్యాపిటల్ గూడ్స్, కొన్ని ఆయిల్ షేర్లు పతనం కాగా, బ్యాంక్‌లు, మెటల్ షేర్ల నుంచి మద్దతు లభించింది. టర్నోవర్ ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.13,570 కోట్లు.

ఏడాది చివరకు సెన్సెక్స్ 32,500కు..: మోర్గాన్
బ్యాక్‌లాగ్ ప్రాజెక్టులకు క్లియర్ చేసేలా ఆర్థిక సంస్కరణలు రానున్నాయని, దీంతో ఈ ఏడాది చివరకు సెన్సెక్స్ 32,500 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొంది.

Advertisement
Advertisement