అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!

11 Feb, 2019 20:21 IST|Sakshi
సిద్ధి వినాయక ఆలయం వద్ద అంబానీ దంపతులు, అనంత్‌ అంబానీ(కర్టెసీ : ఇండియాటుడే))

ముంబై : ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ- నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ వివాహ తేదీ ఖరారైంది. ఆకాశ్‌ అంబానీ- వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కుమార్తె శ్లోకా మెహతా నిశ్చితార్థం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల(మార్చి) 9 నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్‌ సెంటర్‌ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ నేపథ్యంలో అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్‌ అంబానీతో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్‌- శ్లోకాల  వివాహ ఆహ్వాన మొదటి పత్రికను గణనాథుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబరులో పిరమిల్‌ గ్రూపు వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ఇషా- ఆనంద్‌ల వివాహ ఆహ్వాన తొలి పత్రికను కూడా ఇక్కడే ఉంచి పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు