ఆధార్ ఈకేవైసీతో.. మొబైల్ కనెక్షన్ చార్జీలు ఉండవు: ట్రాయ్ | Sakshi
Sakshi News home page

ఆధార్ ఈకేవైసీతో.. మొబైల్ కనెక్షన్ చార్జీలు ఉండవు: ట్రాయ్

Published Sat, Apr 9 2016 1:13 AM

ఆధార్ ఈకేవైసీతో.. మొబైల్ కనెక్షన్ చార్జీలు ఉండవు: ట్రాయ్

న్యూఢిల్లీ: ఆధార్ ఎలక్ట్రానిక్ కేవైసీ విధానాన్ని అమలు చేస్తే అప్పుడు అథంటికేషన్ డిజిటల్ రూపంలో జరిగి కొత్త మొబైల్ కనెక్షన్ యాక్టివేషన్ వ్యయాలు సున్నాకు చేరుతాయని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ఆధార్‌ను అథంటికేషన్ కోసం ఉపయోగిస్తే ట్రాన్సాక్షన్ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. ‘ఒక వ్యక్తి కొత్తగా మొబైల్ కనెక్షన్‌ను తీసుకుంటే.. అక్వైజిషన్ ఫామ్ (సీఏఎఫ్) నింపడం, పేపర్ డాక్యుమెంట్స్  వంటి వాటి వల్ల ప్రస్తుతం మొబైల్ కస్టమర్ యాక్టివేషన్ కోసం రూ.150 వరకు ఖర్చవుతోంది. అదే సీఏఎఫ్‌ను డిజిటల్ రూపంలో నింపితే అంటే ఆధార్ డిజిటల్ ఐడెంటిటీ అథంటికేషన్‌ను అమలు చేస్తే అప్పుడు ఎలాంటి ఖర్చు ఉండదు’ శర్మ అని వివరించారు.

Advertisement
Advertisement