10,500 కిందకి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

10,500 కిందకి నిఫ్టీ

Published Thu, Dec 28 2017 3:58 PM

Nifty closes lower on F&O expiry day - Sakshi

ముంబై : డిసెంబర్‌ నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్ల కాంట్రాక్ట్‌లు ముగింపు నేపథ్యంలో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, మిడ్‌ సెషన్‌ సమయానికి నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్‌ 63.78 పాయింట్ల నష్టంలో 33,848 వద్ద ముగియగా.. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంలో 10,500కి కింద 10,477.9 వద్ద స్థిరపడింది. డిసెంబర్ నెల ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ కావడంతో.. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించినట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు.

అయితే రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 14.5 శాతం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ 6 శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 11.4 శాతం లాభాలు పండించాయి. మెటల్‌, రియాల్టీ సూచీలు 2-3 శాతం లాభాల్లో కొనసాగాయి. కాగ, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోయినా.. ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల లాభంలో 64.10గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 86 రూపాయల నష్టంలో రూ.29,028గా ఉన్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement