లాభాల బోణి,పీఎస్‌యూ బ్యాంకుల హవా | Sakshi
Sakshi News home page

లాభాల బోణి,పీఎస్‌యూ బ్యాంకుల హవా

Published Mon, Jul 17 2017 9:40 AM

Nifty opens above 9,900 on back of positive cues from global markets

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.  అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో  సెన్సెక్స​  74 పాయింట్లు  ఎగిసి 32,095 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి  9,910 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా బ్యాంక్‌  నిఫ్టీ ఇండెక్స్‌  24,000 ఎగువన రికార్డు హైని నమోదు చేసింది.  దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి.  బై బ్యాక్‌ ఆఫర్‌తో  విప్రో టాప్‌  గెయినర్‌గా ఉంది.   బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ప్రభుత్వ బ్యాంకులు ,  ఎంఅండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా, అదానీ , రిలయన్స్‌ భారీ లాభాల్లో,  బీహెచ్‌ఈఎల్‌, కోల్‌ ఇండియా స్వల్పనష్టాల్లో కొనసాగుతున్నాయి.  
అటు డాలర్‌ మారకంలో రూపాయి కూడా లాభాలతోనే ప్రారంభమైంది.  నిన్నటి ముగింపుతో పోలిస్తే 0.09 పైస లు లాభపడి  64.33 వద్ద ఉంది. బంగారం ధరలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి.
 

Advertisement
Advertisement