Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Published Thu, Jul 6 2017 9:47 AM

Nifty opens above 9650, Sensex moderately higher despite weak Asia

ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 85.07 పాయింట్ల లాభంలో 31,330 వద్ద, నిఫ్టీ 20.10 పాయింట్ల లాభంలో 9,657 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.5 శాతం పైకి  ఎగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో లుపిన్‌, టాటా మోటార్స్‌, టాటాపవర్‌, అంబుజా సిమెంట్స్‌, అరబిందో ఫార్మా, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఇన్ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు పండించగా.. బజాబ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు ఒత్తిడిలో కొనసాగాయి.
 
అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి, 64.75 వద్ద ప్రారంభమైంది. వాల్‌ స్ట్రీట్‌ బలపడినప్పటికీ, ఆసియన్‌ మార్కెట్లు మాత్రం బలహీనంగానే ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో బంగారం 28,106 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

Advertisement
Advertisement