9850పైన మొదలైన నిఫ్టీ | Sakshi
Sakshi News home page

9850పైన మొదలైన నిఫ్టీ

Published Tue, Jun 2 2020 9:33 AM

Nifty opens above 9,850 - Sakshi

భారత స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 33438.75 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 9860 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 336 పాయింట్ల లాభంతో 33640 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 9919 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 20వేలపైన 20,163.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

మూడీస్ భారత సావరిన్‌ రేటింగ్‌ను తగ్గించడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపువచ్చని నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్‌-19 భారత్‌ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయడంతో పాటు అనేక ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మూడీస్‌ రేటింగ్‌ సంస్థ భారత్‌ రేటింగ్‌ ‘‘బీఏఏ2’’ నుంచి ‘‘బీఏఏ3’’ తగ్గించింది. అలాగే ఔట్‌లుక్‌ కూడా నెగిటివ్‌లోనే కొనసాగించింది. బ్రిటానియా, ఇండిగో, మదర్‌సన్‌ సుమితో పాటు 18 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు 3 త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న నేపథ్యంలో ట్రేడర్ల కొంత అప్రమత్తత వహించవచ్చు.

హీరోమోటర్స్‌, ఎంఅండ్‌ఎం, జీ లిమిటెడ్‌, టాటామోటర్స్‌, కోటక్‌ బ్యాంక్‌ 2.50శాతం నుంచి 7.16శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, బీపీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 
 

Advertisement
Advertisement