11000 స్థాయిని అందుకున్న నిఫ్టీ

20 Jul, 2020 09:35 IST|Sakshi

డబుల్‌ సెంచరీ లాభాలతో మొదలైన సెన్సెక్స్‌ 

22వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 

ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సోమవారం లాభాంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 218 పాయింట్ల లాభంతో 37238.53 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 10965 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఇటీవల మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వం నేడు కూడా అదే స్థాయిలో జరగడంతో నిఫ్టీ ఇండెక్స్‌ క్షణాల్లో  11000 స్థాయికి అందుకుంది. ఉదయం గం.9:20ని.లకు నిఫ్టీ 11006.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 370 పాయింట్ల లాభాలను ఆర్జించి 37390 వద్ద కదులుతోంది. 

ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇం‍డెక్స్‌ 1.33శాతం లాభంతో 22వేల పైన 22,255 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. మన మార్కెట్‌ ప్రారంభసమయానికి ఆసియాలో అత్యధిక మార్కెట్లు నష్టాల్లో కదులుతున్నాయి. నేడు ఏసీసీ, డెన్‌నెట్‌వర్క్స్‌, ఎస్‌బీ కార్డుతో సహా 40 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుదల, స్టాక్‌-నిర్దేశిత ట్రేడింగ్‌ నేడు సూచీల గమనానికి కీలకం కానున్నాయి.


ఐసీఐసీఐ బ్యాంక్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. హిందాల్కో, బీపీసీఎల్‌, జీ లిమిటెడ్‌, టాటామోటర్స్‌, సన్‌ఫార్మ షేర్లు 1శాతం నుంచి 1.50 నష్టాన్ని చవిచూశాయి. 

మరిన్ని వార్తలు