మళ్లీ 10,000 మార్కు పైకి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

మళ్లీ 10,000 మార్కు పైకి నిఫ్టీ

Published Wed, Oct 11 2017 1:08 AM

Nifty settles above 10K mark

ముంబై: వరుసగా మూడో రోజు మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,000 మార్కును మరోసారి అధిగమించి ఆ పైన స్థిరపడింది. టీసీఎస్‌ ఫలితాలు గురువారం వెల్లడి కానుండడంతో కార్పొరేట్‌ కంపెనీల సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాల ముందు ఇన్వెస్టర్లు కాస్తంత అప్రమత్తతతో వ్యవహరించారు.

పరిమిత కొనుగోళ్లతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు యథావిధిగా మంగళవారం మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు రూ.402 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దీంతో సెన్సెక్స్‌ 77.52 పాయింట్ల లాభంతో 32,370.04 వద్ద, నిఫ్టీ 28.20 పాయింట్ల లాభంతో 10,016.95 వద్ద క్లోజయ్యాయి.


ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ ఐపీవో సూపర్‌ హిట్‌
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ ఐపీవోకు అనూహ్య స్పందన దక్కింది. ఏకంగా 128.22 రెట్లు ఓబర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. చివరి రోజు పెద్ద ఎత్తున బిడ్లు నమోదయ్యాయి. కంపెనీ రూ.460 కోట్ల నిధుల సమీకరణకు గాను 71,24,910 షేర్లను ఆఫర్‌ చేయగా, మంగళవారం చివరి రోజు ముగింపు సమయానికి 91,35,55,264 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ కేటగిరీలో 149 రెట్ల స్పందన లభించింది.

Advertisement
Advertisement