లాభాల జోరు, నిఫ్టీ @9300  | Sakshi
Sakshi News home page

లాభాల జోరు, నిఫ్టీ @9300 

Published Thu, Apr 23 2020 1:09 PM

Nifty tops 9300 points Kotak Bank gains on fundraising plans - Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో  నిఫ్టీ 9300 స్థాయిని అధిగమించింది. అలాగే 500 పాయింట్లకు పైగాఎగిసిన  సెన్సెక్స్  32 వేల స్థాయికి చేరులో వుంది. ఎఎఫ్ఎంసీజీ తప్ప, బ్యాంకింగ్, ఫార్మతో పాటు దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాల జోష్ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగిసి 31807 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 9312  వద్ద  కొనసాగుతోంది. టైటన్, హెచ్ యూఎల్,  పవర్ గ్రిడ్, నెస్లే శ్రీ సిమెంట్, గ్రాసిం స్వల్పంగా నష్టపోతున్నాయి.  వొడాఫోన్ గ్రూపు చెల్లింపులతో వొడాఫోన్ ఐడియా, ఫండ్ రైజింగ్ ప్లాన్లతో కొటక్ మహీంద్ర టాప్ విన్నర్స్ గా ఉన్నాయి. ఇంకా జీ, బ్రిటానియా,  ఓఎన్ జీసీ,  భారతి ఇన్ ఫ్రాటెల్, యూపీఎల్, టాటా స్టీల్,  వేదాంతా, టీసీఎస్, గెయిల్, హిందాల్కో ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్యాంకు లాభపడుతున్నాయి.

చదవండి : కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు
ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ

Advertisement
Advertisement