బిచాణా ఎత్తేస్తున్న నీరవ్‌ మోదీ | Sakshi
Sakshi News home page

బిచాణా ఎత్తేస్తున్న ‘నీరవ్‌’: బిజినెస్‌లు ప్యాకప్‌

Published Mon, Mar 12 2018 11:29 AM

Nirav Modi Likely Packed Up His Business In Hong Kong - Sakshi

హాంకాంగ్‌ : ఇండియా మోస్ట్‌ వాంటెడ్‌ డైమాంటైర్‌ నీరవ్‌ మోదీ బిచాణా ఎత్తేయబోతున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్‌ వ్యాపారాల నుంచి నీరవ్‌ మోదీ వైదొలుగుతున్నట్టు ఇండియా టుడే బహిర్గతం చేసింది. నాన్‌ హాంకాంగ్‌ కంపెనీగా హాంకాంగ్‌ అథారిటీల వద్ద రిజిస్ట్రర్‌ అయిన నీరవ్‌మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ కంపెనీని నీరవ్‌ ఎత్తేసినట్టు ఇండియా టుడే ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్టులో వెల్లడైంది. ఈ కంపెనీ డిసెంబర్‌ 12నే వ్యాపారాల నుంచి వైదొలిగే నోటీసు ఇచ్చిందని, ఈ ఏడాది జనవరి 19న హాంకాంగ్‌ కంపెనీల రిజిస్ట్రరీ దీన్ని నోటిఫై చేసినట్టు తెలిసింది. భారత్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన విచారణ కోసం ఇక్కడికి రావడానికి విదేశ వ్యాపారాలను సాకుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అక్కడికి వెళ్లకముందే హాంకాంగ్‌ బిజినెస్‌లను నీరవ్‌ క్లోజ్‌ చేసేస్తున్నట్టు తెలిసింది. 

ఇటీవల బిచాణా ఎత్తేసిన నీరవ్‌ మోదీ కంపెనీ ఇదే. నీరవ్‌కు చెందిన ఇతర హాంకాంగ్‌ కంపెనీలు నీరవ్‌ మోదీ లిమిటెడ్‌, నీరవ్‌ మోదీ హెచ్‌కే లిమిటెడ్‌, ఫైర్‌స్టార్‌ డైమాండ్‌ లిమిటెడ్‌, ఫైర్‌స్టార్‌ హోల్డిండ్‌ లిమిటెడ్‌లకు నీరవ్‌ మోదీ డైరెక్టర్‌గా కానీ లేదా ఆధిపత్య హక్కులు కానీ కలిగి లేరు. అయితే ఈ కంపెనీలన్నింటికీ ఒకే హాంకాంగ్‌ అడ్రస్‌ ఉంది. అది 21 - 23, 2 / ఎఫ్‌ న్యూ హెన్రీ హౌజ్‌, 10 ఐస్‌ హౌజ్‌ స్ట్రీట్‌, సెంట్రల్‌ హాంకాంగ్‌గా ఉంది. వీటిని కూడా త్వరలోనే సీజ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.

అంతేకాక వీటి ద్వారా వచ్చిన నగదును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా స్పందించడానికి హాంకాంగ్‌ కంపెనీ రిజిస్ట్రరీ అధికారులు స్పందించలేదు.  అంతేకాక ఇటీవల హాంకాంగ్‌ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా హాంకాంగ్‌లో షెల్‌ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేయడం కఠినతరమవుతోంది. అక్రమ నగదును దాచిపెట్టడం కూడా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నీరవ్‌ మోదీ హాంకాంగ్‌లో బిచాణా ఎత్తేస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement