నోకియా 2 ధర రివీల్, లాంచ్‌ ఆఫర్లు | Sakshi
Sakshi News home page

నోకియా 2 ధర రివీల్, లాంచ్‌ ఆఫర్లు

Published Thu, Nov 23 2017 3:21 PM

Nokia 2 Price in India Revealed, Goes on Sale on Friday - Sakshi - Sakshi

హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 2 భారత్‌లో రేపటి నుంచి విక్రయానికి వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌లో భారత్‌లో లాంచ్‌ చేసింది హెచ్‌ఎండీ గ్లోబల్‌. కానీ లాంచింగ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను మాత్రం హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించలేదు. గురువారం భారత్‌లో నోకియా 2 ధరతో పాటు లాంచ్‌ ఆఫర్లను హెచ్‌ఎండీ గ్లోబల్‌ రివీల్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర భారత్‌లో రూ.6,999గా నిర్ణయిస్తున్నట్టు తెలిపింది. ఆఫ్‌లైన్‌ మొబైల్‌ రిటైలర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. 

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదనంగా 45జీబీ వరకు అదనపు డేటా లభించనుంది. ప్రతి రూ.309 రీఛార్జ్‌ లేదా ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై 9 నెలల పాటు అంటే 2018 ఆగస్టు 31 వరకు అదనంగా 5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నామని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. కొటక్‌ 811 సేవింగ్‌ అకౌంట్‌ ప్రారంభించిన ఈ ఫోన్‌ కొనుగోలుదారులకు 12 నెలల యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కూడా లభించనుంది.   

నోకియా 2 స్పెషిఫికేషన్లు..
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 212 ఎస్‌ఓసీ
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
8 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
4100 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్

Advertisement
Advertisement