‘నోకియా–8’వచ్చేస్తోంది.. | Sakshi
Sakshi News home page

‘నోకియా–8’వచ్చేస్తోంది..

Published Thu, Aug 17 2017 11:55 PM

‘నోకియా–8’వచ్చేస్తోంది.. - Sakshi

హెల్సింకి/న్యూఢిల్లీ: నోకియా ప్రియుల ఎదురుచూ పులు తీరాయి. నోకియా తొలి హైఎండ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా ‘నోకియా–8’ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర దాదాపుగా రూ.45,000గా (599 యూరోలు) ఉంది. ఇవి వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నవి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ ఎప్పుడు భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరిస్తుందో ప్రకటించలేదు.

ఇక ఇందులో క్విక్‌ చార్జ్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 3,090 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వైర్‌లెస్‌ హెడ్‌సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 5.3 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 13 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరాలు, ఆండ్రాయిడ్‌ 7.1.1 ఓఎస్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది.
 
డ్యూయెల్‌ సైట్‌ మోడ్‌: నోకియా–8లో డ్యూయెల్‌ సైట్‌ మోడ్‌ అనే ఫీచర్‌ ఉంది. ఇక్కడ ఫ్రంట్, రియర్‌ కెమెరాలను రెండింటినీ ఒకేసారి ఉపయోగించొచ్చు. అది ఫోటోలకైనా, వీడియోలకైనా. ఫ్రంట్, రియర్‌ కెమెరాలను ఒకే సమయంలో వాడేటప్పుడు స్క్రీన్‌ స్పి›్లట్‌ అవుతుంది. డ్యూయెల్‌ సైట్‌ మోడ్‌ ఫీచర్‌తో వస్తోన్న తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ ఇదే. జీస్‌ ఆప్టిక్స్‌ కెమెరాలతో 4కే వీడియోలను తీసుకోవచ్చు.

Advertisement
Advertisement