ఏడేళ్ల కనిష్టానికి పీ–నోట్స్‌ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల కనిష్టానికి పీ–నోట్స్‌ పెట్టుబడులు

Published Fri, Sep 29 2017 1:06 AM

P-notes investment hits over 7-year low of Rs1.25 trillion

న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్‌ ద్వారా దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులు ఏడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఆగస్టు ఆఖరు నాటికి రూ.1.25 లక్షల కోట్ల స్థాయికి తగ్గాయి. సెబీ గణాంకాల ప్రకారం జూలై ఆఖరులోనే అయిదున్నరేళ్ల కనిష్టమైన రూ. 1,35,297 కోట్లకు తగ్గిన పీ–నోట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తాజాగా ఏడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 2010 ఫిబ్రవరి తర్వాత ఇదే కనిష్ట స్థాయి.

అప్పట్లో పార్టిసిపేటరీ నోట్స్‌ పెట్టుబడులు రూ.1,24,177 కోట్లకు క్షీణించాయి. భారతీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లు.. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీఐ) సంస్థలు జారీ చేసే పీ–నోట్స్‌ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. పీ–నోట్స్‌ ద్వారా ఆగస్టులో ఈక్విటీల్లోకి రూ.88,911 కోట్లు రాగా, మిగతాది డెట్, డెరివేటివ్స్‌ మార్కెట్లోకి వచ్చింది. నల్లధనం చలామణీని అరికట్టే దిశగా జూలైలో సెబీ పీ–నోట్స్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇన్వెస్ట్‌ చేసే ప్రతి సాధనంపై రూ.1,000 డాలర్ల ఫీజు విధించింది. అంతకు ముందు ఏప్రిల్‌లోనే ఎన్నారైలు.. వారి సంస్థలు, స్థానిక భారతీయులు పీ–నోట్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడాన్ని నిషేధించింది. 

Advertisement
Advertisement