సొంతింటి ఎంపికలో ఇంటర్నెట్టే కీలకం | Sakshi
Sakshi News home page

సొంతింటి ఎంపికలో ఇంటర్నెట్టే కీలకం

Published Sat, Jun 21 2014 12:35 AM

సొంతింటి ఎంపికలో ఇంటర్నెట్టే కీలకం

 సాక్షి, హైదరాబాద్: ‘ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం ఓ కుగ్రామంలా తయారైంది’ అని అన్నదెవరోగానీ.. అది అక్షరాలా నిజం. క్షణం తీరికలేని నగరవాసులు సొంతింటి ఎంపికలో ఇంటర్నెట్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నెట్ ద్వారానే 50 శాతం నిర్ణయాలు తీసుకుంటున్నారని గూగుల్ ఇండియా సర్వేలో తేలింది. ఇటీవల దేశ వ్యాప్తంగా 15 నగరాల్లో నిర్వహించిన సర్వేలోని కొన్ని కీలకాంశాలివే..
 
* ఇప్పటివరకు స్థిరాస్తి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతికే పోకడ మెట్రో నగరాలకే పరిమితమైంది. కానీ, మూడేళ్లుగా ఇది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించింది. స్థిరాస్తి సమాచారంలో ఇంటర్నెట్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో ప్రింట్ మీడియా, సేల్స్ బ్రోకర్స్ ఆఫీసులున్నాయి.
 
* సొంతింటి కొనుగోలు కోసం 74 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తే, అద్దె ఇంటి కోసం 26 శాతం మంది వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లు, వెంచర్ల గురించి ఇంటర్నెట్‌ను 47 శాతం మంది వినియోగిస్తే, 23 శాతం మంది రీ-సేల్ ప్రాపర్టీల గురించి, మరో 30 శాతం మంది నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజె క్ట్‌ల కోసం నెట్‌ను వినియోగిస్తున్నారు.
 
* ఏటా దేశ వ్యాప్తంగా ు43 బిలియన్ డాలర్లు స్థిరాస్తి వ్యాపారం (నివాస, వాణిజ్య, అద్దె 3 విభాగాలు కలిపి) ఇంటర్నెట్ ద్వారానే జరుగుతోంది. ఇందులో నివాస సముదాయాల వాటా ు31 బిలియన్ డాలర్లుగా ఉండగా.. వాణిజ్య సముదాయాల వాటా ు12 బిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement
Advertisement