వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌పై 7 పైసలు, డీజిల్‌పై 5 పైసలు

Published Thu, May 31 2018 8:45 AM

Petrol, Diesel Prices Cut For Second Consecutive Day - Sakshi

న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాయి. వినియోగదారులకు ముష్టి వేసిన మాదిరిగా నిన్న(బుధవారం) 1 పైసా మాత్రమే తగ్గించిన ఆయిల్‌ కంపెనీలు, నేడు కూడా అదే ధోరణిలో లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధరలు తగ్గించినట్టు తెలిసింది. అంతర్జాతీయంగా ఆయిల్‌ రేట్లు తగ్గుతున్న క్రమంలో దేశీయంగా కూడా ధరలను మెల్లమెల్లగా తగ్గిస్తున్నట్టు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్‌ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ ధర బుధవారం రూ.69.30గా ఉంది. 

ఎడతెడపి లేకుండా.. వరుసగా 16 రోజుల పాటు పెరిగిన ఇంధన ధరలు, ప్రస్తుతం వరుసగా రెండో రోజూ తగ్గాయి. 16 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్‌పై రూ.3.8, డీజిల్‌పై రూ.3.38 ధర పెరిగింది. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ ఆయిల్‌ కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు తాము శాశ్వత పరిష్కారం కనుగొంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

Advertisement
Advertisement