మొండి బకాయిల సమస్యను తక్షణం సరిదిద్దండి | Sakshi
Sakshi News home page

మొండి బకాయిల సమస్యను తక్షణం సరిదిద్దండి

Published Thu, Dec 8 2016 1:45 AM

మొండి బకాయిల సమస్యను తక్షణం సరిదిద్దండి

 న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల సమస్య తక్షణం పరిష్కరించాల్సిన అవసరముందని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. అలా చేయకపోతే ఆర్థిక వ్యవస్థపై మొండి బకాయిలు భారంగా మారతాయని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అధ్యక్షతన గల ఈ సంఘం రూపొందించిన నివేదిక హెచ్చరించింది. 31మంది సభ్యులుగా గల ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంట్‌కు సమర్పించిన   నివేదిక ప్రకారం..రుణాలు మొండి బకాయిలుగా మారకుండానే తగిన సమయంలో బ్యాంకులు జోక్యం చేసుకోవాలి.
 
  ఒకవైపు మనం ఆర్థికంగా సంపన్నమైన దేశాలతో పోటీ పడుతున్నాం. మరోవైపు బ్యాంకుల మొండి బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ మొండి బకాయిల సమస్య కారణంగా బ్యాంక్‌ల మూలధనం, లిక్విడిటీ హరించుకుపోతున్నాయి. భవిష్యత్తులో మూలధనం సమీకరించే బ్యాంకుల సత్తా కూడా క్షీణిస్తోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.80వేల కోట్లుగా ఉన్నాయి. జూన్ నాటికి రూ.5,50,346 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిలు సెప్టెంబర్‌కి రూ.6,30,323 కోట్లకు పెరిగాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement