వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్‌బీ | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్‌బీ

Published Wed, Feb 27 2019 9:08 PM

PNB Cuts MCLR Rates by 10 Bps from Mar 1  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌  బ్యాంకు  రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 0.10 శాతం  కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ ఒక ప్రకటనలోవెల్లడించింది. దీంతో సంవత్సరాల కాలపరిమితి గల లోన్లపై వడ్డీరేటు 8.55శాతం నుంచి 8.45 శాతానికి దిగి రానుంది.  మూడేళ్ల కాల రుణాల రేట్లు 8.65శాతంగా ఉండనున్నాయి.

కాగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని మానిటరీ పాలసీ  తాజా ద్రవ్య పరపతి విధాన సమీకలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వినియోగదారులకు అందించాలని శక్తికాంత దాస్‌ స్పష్టం   చేశారు.  ఈ నేపథ్యంలోనే అతిపెద్ద  ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ  కూడా 0.05శాతం ఎంసీఎల్‌ఆర్‌ను  తగ్గించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement