గ్యాస్ ప్రీమియం ధర ప్రతిపాదన వెనక్కి | Sakshi
Sakshi News home page

గ్యాస్ ప్రీమియం ధర ప్రతిపాదన వెనక్కి

Published Wed, Jun 10 2015 2:18 AM

గ్యాస్ ప్రీమియం ధర ప్రతిపాదన వెనక్కి

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌లో కొంత భాగానికి మార్కెట్ ధర (ప్రీమియం రేటు) ఇవ్వడంపై చమురు శాఖ ప్రతిపాదనను ఆర్థిక శాఖ వెనక్కి పంపించింది. ప్రతిపాదనపై ఆర్థిక శాఖ నిర్దిష్ట అభిప్రాయాలు వ్యక్తపర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అధిక ఉష్ణోగ్రతలు మొదలైన గుణాలు కలిగి ఉండే క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కి సాధారణ రేటుతో పోలిస్తే మరికాస్త ఎక్కువ లభించేలా తగు ఫార్ములాను రూపొందించాలంటూ చమురు శాఖకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం దేశీయంగా మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కి రేటు 4.66 డాలర్లుగా ఉండగా.. మార్కెట్ రేటు 7-8 డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా క్షేత్రాలను బట్టి గ్యాస్ ఉత్పత్తిలో కొంత శాతానికి మార్కెట్ రేటును వర్తింపచేయాలంటూ చమురు శాఖ ప్రతిపాదించింది.

Advertisement
Advertisement