Sakshi News home page

కొనసాగాలనే అనుకున్నా...

Published Fri, Sep 2 2016 1:48 AM

కొనసాగాలనే అనుకున్నా...

కానీ ప్రభుత్వంతో అవగాహన కుదరలేదు..
ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ వెల్లడి

 న్యూఢిల్లీ: రెండు రోజుల్లో (సెప్టెంబర్ 4) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా మూడేళ్ల బాధ్యతల నుంచి తప్పుకుంటున్న రఘురామ్ రాజన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా మరికొంత కాలం కొనసాగాలనే అనుకున్నట్లు పేర్కొన్నారు. అరుుతే పదవీ బాధ్యతల పొడిగింపు విషయమై ప్రభుత్వంతో ‘‘తగిన విధమైన అవగాహనకు’’ రాలేకపోరుునట్లు పేర్కొన్నారు. నిజానికి పదవిలో కొనసాగే విషయమై చర్చలు జరిగాయని, ఒక దశ దాటి అవి ముందుకు సాగలేదని తెలిపారు. అరుుతే ఈ ‘‘అవగాహన’’ ఏమిటన్న విషయంపై ఆయన స్పష్టతను ఇవ్వలేదు.  పూర్తి చేయాల్సిఉన్న పనులు ఇంకా మిగిలి ఉండడమే బాధ్యతల్లో కొనసాగాలనుకోవడానికి కారణమని అన్నారు. అరుునా తన బాధ్యతలను సంతృప్తిగానే విరమిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్ గురువారంనాడు ముంబైలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement