ఆర్బీఐ ఎంఎస్ఎస్ బాండ్ల పరిమితి 6 లక్షల కోట్లకు.. | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ ఎంఎస్ఎస్ బాండ్ల పరిమితి 6 లక్షల కోట్లకు..

Published Sat, Dec 3 2016 12:56 AM

ఆర్బీఐ ఎంఎస్ఎస్ బాండ్ల పరిమితి 6 లక్షల కోట్లకు.. - Sakshi

ప్రస్తుత పరిమితి రూ.30 వేల కోట్లు...
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో
ద్రవ్య సరఫరా ఎగబాకడంతో చర్యలు 

ముంబై : పెద్ద నోట్లరద్దు (డీమోనిటైజేషన్) నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తున్న అదనపు ద్రవ్య సరఫరాను(లిక్విడిటీ) వెనక్కితీసుకోవడానికి కేంద్రం, ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నారుు. మార్కెట్ స్థిరీకరణ స్కీమ్(ఎంఎస్‌ఎస్) ద్వారా ఇప్పుడున్న బాండ్‌ల జారీ పరిమితిని రూ.30 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.6 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. అరుుతే, తక్షణం ఆర్‌బీఐ ఈ ఎంఎస్‌ఎస్ పరిమితి మొత్తాన్ని వినియోగించుకోదని.. ఈ పరిమితికి లోబడి బాండ్‌ల జారీ కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

‘ఈ ఏడాది ప్రభుత్వ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో కేటారుుంపులు ఇప్పటికే చేశాం. దీనికి అనుగుణంగానే బాండ్‌ల జారీ ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అరుుతే, ఎంఎస్‌ఎస్ పరిమితి పెంచిన కొద్ది సేపటికే ప్రభుత్వానికి చెందిన రూ.20 వేల కోట్ల విలువచేసే 28 రోజుల క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్స్(సీఎంబీ)ను వేలం వేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించడం గమనార్హం. ట్రెజరీ బిల్స్(బాండ్‌‌స) మాదిరిగానే ఈ సీఎంబీలను కూడా వ్యవహరిస్తారు.

భారీ డిపాజిట్ల ప్రభావం...
నల్లధనానికి చెక్ చెప్పడం కోసమంటూ మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఈ నెల 31 వరకూ కేంద్రం గడువు ఇచ్చింది. అరుుతే, ఇప్పటికే బ్యాంకుల్లోకి రూ.11 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో వెల్లువెత్తడంతో ఒక్కసారిగా ద్రవ్య సరఫరా పెరిగిపోరుుంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం చెలామణిలో మొత్తం రూ.14 లక్షల కోట్ల మేర విలువైన పెద్ద నోట్లు ఉన్నట్లు అంచనా. డిపాజిట్‌లకు గడువు ఇంకా దాదాపు నెల రోజులు ఉండగానే బ్యాంకుల వద్దకు రూ.11 లక్షల కోట్లు చేరడంతో మిగతా మొత్తం కూడా వచ్చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డీమోనిటైజేషన్ కారణంగా లిక్విడిటీలో భారీ పెరుగుదల మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యసరఫరా నిర్వహణ కార్యకలాపాలు సజావుగా జరిపేందుకుగాను ఆర్‌బీఐ సూచనల మేరకు ఎంఎస్‌ఎస్‌లో భాగంగా బాండ్ల జారీ పరిమితిని రూ. 6 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది’ అని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

కాగా, భారీ అదనపు లిక్విడిటీని బ్యాం కింగ్ వ్యవస్థ నుంచి తీసుకునేందుకు తాత్కాలికంగా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ను ఆర్‌బీఐ గత వారంలో 100 శాతానికి పెంచడం తెలిసిందే. అంతక్రితం వరకూ ఇది 4%గా ఉంది. బ్యాంకుల డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణాన్ని సీఆర్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. దీనిపై ఆర్‌బీఐ బ్యాంకులకు ఎలాంటి వడ్డీ చెల్లించదు.

ఎంఎస్‌ఎస్ అంటే...
ద్రవ్య సరఫరా నిర్వహణలో భాగంగా అవసరమైనప్పుడు మార్కెట్లో సెక్యూరిటీ(బాండ్)లను జారీ(విక్రయం) చేసేందుకు ఉద్దేశించిందే ఈ ఎంఎస్‌ఎస్. అరుుతే, ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నిధుల సమీకరణకు ఎంఎస్‌ఎస్ ద్వారా బాండ్‌లను జారీ చేయరు. ఎంఎస్‌ఎస్ బాండ్‌లపై చెల్లించే వడ్డీ రేటు అనేది 14 రోజులు, 28 రోజుల క్యాష్ మేనేజ్ మెంట్ బిల్స్(సీఎంబీ) లేదా 364 రోజుల ట్రెజరీ బిల్స్.. ఇలా కాలవ్యవధి(మెచ్యూరిటీ) ప్రకారం నిర్ణరుుస్తారు. వ్యవస్థలో ఉన్న లిక్విడిటీ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధమైన బాండ్లను జారీ చేయాలనేదానిపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది.

నగదు సరఫరా వివరాలను బయట పెట్టాలి బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్..
చెన్నై: బ్యాంకుల వారీగా జరిపిన కరెన్సీ నోట్ల సరఫరా వివరాలను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారుు. ఈ మేరకు ఆర్‌బీఐకి సూచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) కోరారుు.

బ్యాంకులకు తగినంత నగదు సరఫరా చేశామని ఆర్‌బీఐ చెబుతుండగా... క్షేత్ర స్థారుులో పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లారుు. ఆర్‌బీఐ తగినంత నగదు పంపించినప్పటికీ బ్యాంకు సిబ్బందే ఉద్దేశపూర్వకంగా చెల్లింపులు చేయడం లేదన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారుు. ‘‘ఈ పరిస్థితుల దృష్ట్యా కరెన్సీ చెస్ట్‌లు, బ్యాంకులకు రోజువారీ చేసిన నగదు సరఫరా వివరాలను తక్షణమే వెల్లడించాలని ఆర్‌బీఐకి సూచించాలి’’ అని ఉద్యోగ సంఘాలు మంత్రిని కోరారుు.

Advertisement
Advertisement