ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు అంబానీ పోటీ | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు అంబానీ పోటీ

Published Mon, Jul 30 2018 11:18 AM

Reliance Retail Takes Fight To Flipkart, Amazon Doorsteps - Sakshi

కోల్‌కతా : వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌, అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లు.. ముఖేష్‌ అంబానీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోబోతున్నాయి. ఈ రెండింటిపై పోటీకి దిగుతూ.. రిలయన్స్‌ రిటైల్‌, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లను ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టేందుకు ఓ వెంచర్‌ ఏర్పాటు చేసినట్టు ఇద్దరు సీనియర్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. రిలయన్స్‌ రిటైల్‌, దేశీయ అతిపెద్ద బ్రిక్‌ అండ్‌ మోర్టర్‌ రిటైలర్‌ చైన్‌. ఇది తాజాగా ఆన్‌లైన్‌గా అరంగేట్రం చేసింది.

స్మార్ట్‌ఫోన్లను, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌గా విక్రయించడానికి రిలయన్స్‌ రిటైల్‌ ఓ ఆన్‌లైన్‌ షాపును లాంచ్‌ చేసిందని తెలిసింది. స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, ఎలక్ట్రానిక్స్‌ కేటగిరీలు దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సుమారు 55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని కలిగిస్తున్నాయి. దీంతో వచ్చే పండుగ కాలంలో టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయాలు చేపట్టడానికి రిలయన్స్‌ రిటైల్‌ సిద్ధమైంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సరితూగే ఆఫర్లను కూడా ఇది ఆఫర్‌ చేయబోతుంది. ఇతర ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ల మాదిరిగా పాత మోడల్స్‌పై, ఎక్స్‌క్లూజివ్‌ మోడల్స్‌పై ఎప్పడికప్పుడూ భారీ డిస్కౌంట్లను రిలయన్స్‌ రిటైల్‌ ఆఫర్‌ చేయనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఇతర ప్రొడక్ట్‌లు కూడా రిలయన్స్‌ డిజిటల్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ధరలకు సమానంగా ఉండనున్నాయని తెలిపారు.

రిలయన్స్‌ డిజిటల్‌ ఇప్పటికే తన ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఎల్‌జీ, శాంసంగ్‌, సోనీ, షావోమి, పానాసోనిక్‌ వంటి టాప్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను తక్కువ రేటుకే అందిస్తోంది. ‘దేశవ్యాప్తంగా ఇప్పుడే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. రిలయన్స్‌ డిజిటల్‌ను విస్తరించడానికి ఇదొక ఓమ్ని-ఛానల్‌. ఇది ఆన్‌లైన్‌ కార్యకలాపాలను విజయవంతం చేయడానికి ఎక్కువగా దృష్టి సారిస్తోంది’ అని మరో ఎగ్జిక్యూటివ్‌ కూడా చెప్పారు. 

ఆన్‌లైన్‌లో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 38 శాతం, టెలివిజన్లు 12 శాతం, అప్లియెన్స్‌ 6-7 శాతం ఆక్రమించుకుంటున్నాయి. పర్సనల్‌ కేర్‌ గాడ్జెట్లు 15 నుంచి 20 శాతం ఆన్‌లైన్‌ షేరును కలిగి ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం మాల్‌, షావోమి ఎంఐ ఆన్‌లైన్‌ స్లోర్‌లే స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ విక్రయాల్లో దేశీయ అతిపెద్ద ఆన్‌లైన్‌ స్టోర్‌లుగా ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్‌ తన ఫ్యాషన్‌ ఫార్మట్‌ల కోసం ఈ-కామర్స్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ, ఎఫ్‌ఎంసీజీ, పండ్లు, కూరగాయల కోసం రిలయన్స్‌ స్మార్ట్‌ను కూడా నడుపుతోంది. అయితే ఇది కేవలం ముంబై, పుణే, బెంగళూరులకే విస్తరించి ఉంది. రిలయన్స్‌ స్మార్ట్‌ను మరింత విస్తరించడానికి కంపెనీ ప్లాన్‌ చేసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement