ప్రకృతి ఒడిలో నివాసం! | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో నివాసం!

Published Sat, Sep 13 2014 1:50 AM

ప్రకృతి ఒడిలో నివాసం! - Sakshi

సాక్షి, హైదరాబాద్: మనిషి ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలో పుట్టి.. పెరిగి.. చివరకు ప్రకృతిలోనే కలిసిపోవాల్సిందే. సాంకేతిక సౌకర్యాలెన్నున్నా.. పచ్చని ప్రకృతిలో నివసిస్తే కలిగే ఆనందమే వేరు. అందుకే నేటితరం ప్రకృతిలో నివసించేందుకే ఇష్టపడుతున్నార ంటున్నారు ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రా రెడ్డి. నగరంలో నిర్మిస్తున్న పలు గ్రీనరీ ప్రాజెక్ట్‌ల గురించి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.

 కొండాపూర్‌లో 3.6 ఎకరాల్లో ‘ఆర్వీ పాంచజన్య’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మూడు బ్లాకుల్లో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య 310. మొదటి బ్లాకును వచ్చే ఏడాది మార్చి, రెండో బ్లాకును జూన్ కల్లా పూర్తి చేస్తాం. మూడో బ్లాకును ఈ ఏడాది దసరాకు ప్రారంభిస్తాం. ఇక ధర విషయానికొస్తే ఈ మధ్య చ.అ.కు రూ.200లు పెంచి రూ.4,000లుగా చెబుతున్నాం.

ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రాజెక్ట్ చుట్టూ దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇండియన్ ఇమ్యూనాలజీ లిమిటెడ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బొటానికల్ గార్డెన్ ఉండటంతో పచ్చని ప్రకృతి మధ్య ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఫ్లాట్ల డిజైన్ చూస్తే  రో హౌజ్ కాన్సెప్ట్ విత్ లో లెవెల్ కారిడార్‌తో ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఉంటుంది.

 సుచిత్ర సర్కిల్ పైప్‌లైన్ రోడ్‌లో 2 ఎకరాల్లో ‘ఆర్వీ ఆద్విక్’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. రెండు బ్లాకుల్లోని మొత్తం ఫ్లాట్ల సంఖ్య 140. ఇప్పటికే ‘అముక్త’ బ్లాక్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది. ‘అవ్యక్త’ బ్లాక్‌ను వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. చ.అ. ధర రూ.2,400లుగా
 నిర్ణయించాం.

గచ్చిబౌలిలో 1.5 ఎకరాల్లో ‘ఆర్వీ శిల్పా హిల్ టాప్’ ప్రాజెక్ట్ చివరి దశ నిర్మాణంలో ఉంది. డిలాయిట్, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి క్రాస్ రోడ్‌ల నుంచి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లోని మొత్తం ఫ్లాట్ల సంఖ్య 128. ఇప్పటికే 60 శాతం గృహ ప్రవేశం చేసి ఆహ్లాదభరిత వాతావరణంలో జీవిస్తున్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో 2, 3 పడక గదుల ఫ్లాట్లు, 2,200 చ.అ. నుంచి 2,900 చ.అ. విస్తీర్ణం గల డ్యూప్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర చూస్తే చ.అ.కు రూ.4,500లుగా చెబుతున్నాం. ఆర్వీ నిర్మాణ్‌లోని అన్ని ప్రాజెక్టుల్లో విశాలమైన క్లబ్ హౌజ్‌తో పాటు అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నాం.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం శివానగర్‌లో మరో బిల్డర్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నాం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement