రూపాయి విలువ మరింత పతనం | Sakshi
Sakshi News home page

రూపాయి విలువ మరింత పతనం

Published Wed, Nov 13 2013 11:03 AM

రూపాయి విలువ మరింత పతనం

రూపాయి పతనం కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ రూపాయి విలువ మరింత దిగజారింది. బుధవారం దేశీయ కరెన్సీ విలువ మరో 17 పైసలు పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ట స్థాయిలో 63.88 వద్దకు దిగజారింది.

మంగళవారం రూపాయి మారకం విలువ 47 పైసలు పడిపోయి 63.71 వద్ద ముగియగా, మరుసటి రోజు మరింత దిగజారడం ఆందోళన కలిగించే విషయం.  దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడం రూపాయి క్షీణతకు దారితీసినట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా డాలరు బలపడటం కూడా దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపింది. నష్టాల బాటలో నడుస్తున్న బీఎస్‌ఈ సెన్సెక్స్పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఆరంభంలో 53.97 పాయింట్లు కోల్పోయింది.

Advertisement
Advertisement