సకాల వర్ష అంచనాలతో.. | Sakshi
Sakshi News home page

సకాల వర్ష అంచనాలతో..

Published Sat, May 16 2015 1:01 AM

సకాల వర్ష అంచనాలతో..

118 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్
- 27,324 పాయింట్ల వద్ద ముగింపు
- 38 పాయింట్ల లాభంతో 8,262కు నిఫ్టీ

ముంబై: వర్షాలు సకాలంలోనే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది.  ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉందని, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటులు నియంత్రణలోనే ఉన్నాయన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాఖ్యలు సెంటిమెంట్‌కు మరింత ఊపునిచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 27,324 పాయింట్ల వద్ద, 38 పాయింట్లు లాభంతో 8,262 పాయింట్ల వద్ద ముగిశాయి. రానున్న ద్రవ్యపరపతి విధానంలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో సెంటిమెంట్ బలపడిందనీ విశ్లేషణ.
 
అంతా సవ్యంగా లేదు
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు పెరగడంతో ఇంట్రాడేలో 27,380 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 27,160 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మళ్లీ లాభాల్లోకి వచ్చి చివరకు 118 పాయింట్ల వృద్ధితో 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,279-8,212 పాయింట్ల మద్య కదలాడింది.
 
లాభ నష్టాలు...
30  సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభపడ్డాయి. 1,455 షేర్లు లాభాల్లో, 1,234 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
 
టర్నోవర్...
టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,533 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,498 కోట్లుగా నమోదయ్యింది.  ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో ఈ విలువ రూ.1,87,153 కోట్లు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) రూ.38 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.564 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement