ఫెడ్‌ వడ్డన: రూపాయి జంప్‌ | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ వడ్డన: రూపాయి జంప్‌

Published Thu, Jun 14 2018 9:45 AM

Rupee jumps 8 paise against dollar to 67.57         - Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ కరెన్సీ రూపాయి గురువారం సానుకూలంగా ప్రారంభమైంది.  ఫెడ్‌ వడ్డీ రేటు పెంపు నిర్ణయంతో అమెరికా కరెన్సీ డాలర్‌ బలహీన పడిన నేపథ్యంలో​ రూపాయి పుంజుకుంది. నిన్నటి ముగింపు నుంచి కోలుకుంది. డాలరు మారకంలో రూపాయి 8పైసలు ఎగిసి 67.57 వద్ద మొదలైంది.  బుధవారం 16పైసలు క్షీణించిన రూపాయి 67.65 వద్ద  ఒకవారం కనిష్టాన్ని నమోదు చేసింది. బ్యాంకులు,  ఎగుమతిదారులు డాలరులో అమ్మకాలకు దిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. అంచనాలకు అనుగుణంగా ఫెడ్‌ 0.25 శాతం వడ్డీ రేటును పెంచడంతోపాటు ఈ ఏడాది మరో రెండుసార్లు పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

కాగా అమెరికా ఫెడ్‌ తన ఫండ్స్‌ రేటును 25శాతం పెంచింది. దీంతోపాటు 2018 మరోరెండుసార్లు, 2019లోనాలుగుసార్లువడ్డీ రేట్ల వడ్డన ఉంటుందనే సంకేతాలిచ్చింది. దీంతో అటు ఆసియా మార్కెట్లు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందిస్తున్నాయి.

Advertisement
Advertisement