వరల్డ్‌లో అతిపెద్ద కర్వ్‌డ్‌ మానిటర్‌ | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతిపెద్ద కర్వ్‌డ్‌ మానిటర్‌

Published Wed, Dec 20 2017 5:00 PM

Samsung launches world's biggest curved monitor in India  - Sakshi

భారత్‌లో ఈ ఏడాది ప్రారంభంలో తొలి కర్వ్‌డ్‌ గేమింగ్‌ మానిటర్‌ను విడుదల చేసిన శాంసంగ్‌, నేడు ప్రపంచంలో అతిపెద్ద కర్వ్‌డ్‌ క్యూలెడ్‌ మానిటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 49 అంగుళాల సైజు ఉన్న సీహెచ్‌జీ90 మానిటర్‌ను శాంసంగ్‌ ప్రత్యేకంగా బిజినెస్‌ల కోసం రూపొందించింది. అంతేకాక హార్డ్‌కోర్‌ గేమర్స్‌గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ధర కూడా అంతే భారీ మొత్తంలో రూ.1.50 లక్షలుగా శాంసంగ్‌ కంపెనీ నిర్ణయించింది. దీన్ని శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, రీటెయిల్ స్టోర్స్‌లలో కొనుగోలు చేయవచ్చు. 

32:9 యాస్పెక్ట్ రేషియో, డబుల్ ఫుల్ హెచ్‌డీ (3840 x 1080 పిక్సల్స్) స్క్రీన్ రిజల్యూషన్, హై డైనమిక్ రేంజ్ (హెచ్‌డీఆర్) టెక్నాలజీ, ఐ సేవర్ మోడ్, ఫ్లికర్ ఫ్రీ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఈ మానిటర్‌లో ఉన్నాయి. ఈజీ సెట్టింగ్‌ బాక్స్‌ ఎస్‌/డబ్ల్యూను కూడా శాంసంగ్‌ కొత్త కర్వ్‌డ్‌ మానిటర్‌ సపోర్టు చేస్తోంది. దీంతో స్క్రీన్‌ను వివిధ సైజుల్లో డిస్‌ప్లేలుగా విభజించుకోవచ్చు. కేవలం ఇది అతిపెద్దది మాత్రమే కాదని, స్పెషిఫికేషన్లు, టెక్నాలజీ పరంగా కూడా ఇది ట్రెండ్‌ సెట్టర్‌ అని శాంసంగ్‌ ఇండియా కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ సేథి తెలిపారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement