శాంసంగ్ నోట్ 7 యూజర్లకు గుడ్ న్యూస్! | Sakshi
Sakshi News home page

శాంసంగ్ నోట్ 7 యూజర్లకు గుడ్ న్యూస్!

Published Tue, Oct 18 2016 10:46 PM

శాంసంగ్ నోట్ 7 యూజర్లకు గుడ్ న్యూస్!

దక్షిణ కోరియా స్మార్ట్ ఫోన్ మేకింగ్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ కు గెలాక్సీ నోట్ 7 మంటలు ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టింది. తమ ఫోన్లను(గెలాక్సీ నోట్ 7) విమానాల్లో మాత్రం అసలు వాడవద్దని, స్విచ్ఛాఫ్ చేయడం ఉత్తమమని ఇటీవల ప్రకటించిన ఆ కంపెనీ తాజాగా మరో పద్ధతిని పాటిస్తోంది. విమానాలలో అమెరికాకు వెళ్తున్న, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల వద్ద గెలాక్సీ నోట్ 7 ఉంటే వాటిని రీప్లేస్ చేసేందుకు ఎయిర్ పోర్టుల్లో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది. పేలుతున్న ఆ మోడట్ మోబైల్స్ కు బదులుగా వేరే స్టార్ట్ ఫోన్స్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికాలో విమాన ప్రయాణాల్లో ఈ మోడల్ పై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అమెరికాలో కొన్ని ప్రముఖ విమానాశ్రయాల్లో మాత్రమే తమ సెంటర్స్ ఏర్పాటు చేశామని, అయితే ఆ ఎయిర్ పోర్టుల జాబితాను ప్రస్తుతం వెల్లడించలేకపోతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 రీస్లేస్ సెంటర్ ఏర్పాటు చేశారని అక్కడి మీడియా ప్రతినిధి సెర్గియో క్వింటానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణకోరియా మీడియాల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని అత్యంత రద్దీ ఉండే ఎయిర్ పోర్టుల్లో కూడా శాంసంత్ కొన్ని స్టార్ట్ ఫోన్ రీప్లేస్ సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఒకవేళ యూజర్లు తమ మనీ రీఫండ్ చేయమని అడిగినా, కొత్త స్మార్ట్ ఫోన్ కొనుకోలు చేసినా వాటికి సంబంధి కంపెనీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయదని శాంసంగ్ ప్రతినిధి తెలిపారు.

Advertisement
Advertisement